గరుడదాత్రి న్యూస్ మైదుకూరుజులై 20:-
మైదుకూరు శాసనసభ్యులు శ్రీ పుట్టా సుధాకర్ యాదవ్ గారు రేపు, 21-07-2026 (మంగళవారం) నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించనున్నారు. రైతాంగానికి, ప్రజలకు సాగు నీరు, తాగు నీరు అందించే లక్ష్యంతో పలు ప్రాజెక్టుల ద్వారా నీటిని విడుదల చేసే కార్యక్రమాల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొననున్నారు.
పర్యటన వివరాలు:
ఉదయం 10:00 గంటలకు:
బ్రహ్మంగారిమఠంలోని బ్రహ్మం సాగర్ ప్రాజెక్టు లెఫ్ట్ కెనాల్ నుండి రైతులకు సాగునీటిని అధికారికంగా విడుదల చేయనున్నారు.
సాయంత్రం 4:00 గంటలకు:
మైదుకూరు మండలం లెక్కలవారిపల్లె సమీపంలోని ఎస్‌ఆర్-2 (SR-2) నుండి మైదుకూరు చెరువులకు నీటిని విడుదల చేసే కార్యక్రమంలో పాల్గొంటారు.
ముఖ్య మనవి:
ప్రజా ప్రయోజనాలే ధ్యేయంగా జరుగుతున్న ఈ కార్యక్రమాల్లో మైదుకూరు నియోజకవర్గ పరిధిలోని మండల టీడీపీ అధ్యక్షులు, ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు మరియు ప్రింట్ & ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొని, కార్యక్రమాలను కవర్ చేసి విజయవంతం చేయాల్సిందిగా కోరడమైనది.
